విశేషమైన జ్ఞానమే పరబ్రహ్మ స్వరూపము

Friday, November 04, 2011

జాబిల్లి!

ఓ చిరునవ్వుల  జాబిల్లి!
నీ నవ్వులే వికసించెను హరివిలై!


నీవు పలుకరిస్తే ప్రకృతి పులకరిస్తుంది!
నీవు కలవరిస్తే ప్రకృతి జలదరిస్తుంది!
 
నీ పలుకులతో స్వరాలు రాగాలు నేర్చాయి!
నీ పెదవులపై నవ్వులు నాట్యమాడతాయి!
 
సప్త స్వరాలూ నీ అందెల మువ్వలలో కూర్చబడినాయి!
సప్త వర్ణాలు  నీ మేనిచాయ ముందు వెలవెల పోయాయి!

ప్రేమ పారవశ్యం!




నీవు నవ్వితే అది పూలవర్షం!
నీవు కోపిస్తే అది రాళ్ళవర్షం!  


నీ చూపు చంద్రుడిని మించిన చల్లదనం! 
నీ మాట తేనెను మించిన మకరందం!

నిన్ను చూస్తే పోతుంది జ్ఞానం!
నిన్ను చూడకుంటే పోతుంది ప్రాణం!


నిన్ను తాకితే నే శిలను అవుతా!
నిన్ను తాకకుంటే నే శిధిలమవుతా!


నీ కొరకై వేచి వుంది ఈ హృదయ మందిరం!
నీవు సై అంటే ఈ జీవితం అవుతుంది రసరమ్యం! 

నీ స్నేహం తీయ్యని జ్ఞాపకం!

నిన్ను చూడకుంటే మరువగలను
కానీ నిన్ను చూడకుండా ఉండలేను!
నిన్ను తలవకుంటే చూడకుండా ఉండగలను
కానీ నిన్ను తలవకుండా ఉండలేను!
నీ చూపు వేసవిలో హేమంతం!
నీ మాటలు పువ్వుల్లో మకరందం!
నీ పరిచయం అందమైన అనుభవం!
నీ స్నేహం ఒక తీయ్యని జ్ఞాపకం!

కదిలే దైవము అమ్మ! కనిపించే దైవము అమ్మ!

దైవమా!

ఎన్నో బందాలను తెలుసుకున్నాను,  తల్లి బిడ్డల బందంను మించిన బందం లేదు!
ఎన్నో విద్యలు నేర్చాను, అమ్మ చూపే ప్రేమాబిమానాలను మించిన విద్య లేదు!
ఎన్నో రాగాలను విన్నాను, అమ్మ చూపించే అనురాగం కంటే మించిన రాగం లేదు!
ఎన్నో ప్రేమకదలను చదివాను, అమ్మ ప్రేమలోని స్వచ్ఛతను మరెక్కడా చూడలేదు!
ఎన్నో ప్రకృతి అందాలను చూసాను, అమ్మ మనసు కంటే అందమైనది లేనేలేదు!      
ఎన్నో అనందాలను తెలుసుకున్నాను, అమ్మ వర్షించే ఆనందాశ్రువులను మించి లేవు!
ఎన్నో రుచులను చూసాను, అమ్మ చేతివంటను మించిన రుచిని ఆస్వాదించలేదు!
ఎన్నో భాషలు విన్నాను, అమ్మ మాటలోని తియ్యదనం మరెక్కడా అనుభవం కాలేదు!
ఎన్నో రంగులు చూసాను, అమ్మ చేతి స్పర్శ సప్తవర్ణ సద్రుస్యమై ఉన్నది ఇంతకంటే రంగులు లేవు!
అడగకనే వరాలిచ్చే ఓ మాతృ మూర్తి, ఆరాధ్య దైవమా సాటి లేరు నీకెవ్వరు సరిరారు నీకెవ్వరు!
అసక్తుడనై ఏమి సమర్పించలేకున్నాను నా మనోఫలకమునే పాదపీటముగా నెంచి, స్వీకరించు పాదబివందనం!

Tuesday, June 28, 2011

నీలో నేనున్నాను!

నీ చూపును నేను!
నీ మాటను నేను!
నీ రాగము నేను!
నీ భావము నేను!
నీ నీడను నేను!
నీ ద్యాసను నేను!
నీ తలపును నేను!
నీ నవ్వును నేను!
నీ నడతను నేను!
నీ కదలికను నేను!
నీ దేహము నా స్థావరం!

నా ప్రయాణం!

అనంత సాగరం లో -  ఈ జీవితంలో  
హోరు గాలిలో - ప్రతిభందకాలలో  
జోరు వానలో - మానసిక ఒత్తిడిలో  
చిమ్మ చీకట్లలో - నిరాస నిస్పృహలలో
ఎగసిపడే కెరటాలలో- భవ భందలతో   
దారి తెలియక - సంకటస్థితిలో   
తిరుగాడు చున్న - జీవిస్తున్న
ఓ ఒంటరిని! - జీవమును!.
నా గమ్య స్థానం -  మోక్షం (జన్మ రాహిత్యం)    
నన్ను నేను తెలుసుకొనుటయే - ఆత్మశోధన

Tuesday, May 24, 2011

నీవై నేనున్నాను!

నువ్వు లేని నేను నేను కాను!
నాది అని చెప్పబడేది అంతానీదే!
నిన్నే తలచే నేను నీవై ఉన్నాను!
ఏ రూపము చూసినా నువ్వే!
అన్నిటా నువ్వే అంతటా నువ్వే!
నేపలికే పలుకులు పలికించేది నువ్వే!
నీ ధ్యాసే నా అధ్యయనం!
నిను గ్రహించుటయే నా లక్ష్యం!
నీవు లేని ఈ శరీరం వ్యర్ధము!

వివరణ:- నువ్వు, నీదే, నిన్నే, నువ్వే, నిన్ను, నీవు మరియు నీ అను పదములు ఆత్మ ను ఉద్దేశించి ప్రయోగించబడినవి.  ఆత్మ లేని దేహము నేను అనుటకు అనర్హమైనది. నాది అని మనము పలికేదీ అంతయు ఆత్మ కు సంబందించినదే!. ఆత్మ ను నిత్యము తలచే నేను ఆత్మయై ఉన్నాను. ఏ రూపము చూసిన ఆత్మ స్వరూపమే, అన్ని దేహములయందును ఆత్మ ఉన్నది అంతటా ఆత్మ రూపమై ఉన్నది!. నా మాటలు అన్ని ఆత్మచే పలికించబడినవి. నేను అధ్యయనం చేసేది ఆత్మ స్వరూపమును గురించే, ఆత్మ స్వరూపమును తెలుసుకొనుటయే నా లక్ష్యం. ఆత్మ విడిచిన దేహము మృత శరీరము నేను అను భావన నశించే సమయము అన్ని భంధములుభాధ్యతలను చేధించే సమయము!.