విశేషమైన జ్ఞానమే పరబ్రహ్మ స్వరూపము

Tuesday, May 24, 2011

నీవై నేనున్నాను!

నువ్వు లేని నేను నేను కాను!
నాది అని చెప్పబడేది అంతానీదే!
నిన్నే తలచే నేను నీవై ఉన్నాను!
ఏ రూపము చూసినా నువ్వే!
అన్నిటా నువ్వే అంతటా నువ్వే!
నేపలికే పలుకులు పలికించేది నువ్వే!
నీ ధ్యాసే నా అధ్యయనం!
నిను గ్రహించుటయే నా లక్ష్యం!
నీవు లేని ఈ శరీరం వ్యర్ధము!

వివరణ:- నువ్వు, నీదే, నిన్నే, నువ్వే, నిన్ను, నీవు మరియు నీ అను పదములు ఆత్మ ను ఉద్దేశించి ప్రయోగించబడినవి.  ఆత్మ లేని దేహము నేను అనుటకు అనర్హమైనది. నాది అని మనము పలికేదీ అంతయు ఆత్మ కు సంబందించినదే!. ఆత్మ ను నిత్యము తలచే నేను ఆత్మయై ఉన్నాను. ఏ రూపము చూసిన ఆత్మ స్వరూపమే, అన్ని దేహములయందును ఆత్మ ఉన్నది అంతటా ఆత్మ రూపమై ఉన్నది!. నా మాటలు అన్ని ఆత్మచే పలికించబడినవి. నేను అధ్యయనం చేసేది ఆత్మ స్వరూపమును గురించే, ఆత్మ స్వరూపమును తెలుసుకొనుటయే నా లక్ష్యం. ఆత్మ విడిచిన దేహము మృత శరీరము నేను అను భావన నశించే సమయము అన్ని భంధములుభాధ్యతలను చేధించే సమయము!. 

No comments:

Post a Comment