నీ చూపులతో గాయం చేసి
నీ మాటలతో మంత్రం వేసి
నీ రూపముతో పాశము వేసి
నీ మనస్సులో మంచిని చూపి
నీ మౌనంతో దూరం చేసి
నీ నవ్వులో స్వచ్ఛతను చూపి
నీ తలపులతో మతిబ్రంసము చేసి
నీ జ్ఞానములో విజ్ఞానము చూపి
నీ హృదయంలో బందీని చేసి
నీ ఊహలతో ఉయ్యాలలూపి
నీ నడతలో నవ్యతను చూపిన
నీ కొరకై ఉన్నాను వేచి!
No comments:
Post a Comment