విశేషమైన జ్ఞానమే పరబ్రహ్మ స్వరూపము

Thursday, March 31, 2011

నీకే అంకితము


చంద్రునికి ఏమి తెలుసు చల్లదనమంటే! 
నీ చల్లని చూపు తాకితే సూర్యుడు సైతం చల్లపడతాడు! 


ఇంద్ర ధనస్సు కేమితెలుసు రంగులంటే!
నీ కళ్ళను  చూస్తే తెలుస్తుంది అన్ని రంగులు నీవేనని!


కోకిల కేమితెలుసు రాగమంటే!
నీ పలుకులు వింటే కోకిల కూడా కొత్త రాగాలను నేర్చుకుంటుంది!


గులాబి కేమి తెలుసు అందమంటే!
నీ నవ్వును చూస్తే గులాబీలు తమ ఓటమిని అంగీకరిస్తాయి!


తుమ్మెదల కేమితెలుసు మకరందమంటే!
నీ పెదవులు తాకితే తెలుస్తుంది అమృతమంటే!


మల్లెల కేమితెలుసు స్వచ్ఛత గురించి!
నీ మనస్సు తెలిస్తే మల్లెలు తమ తలపులు మార్చుకుంటాయి!


పువ్వుల కేమితెలుసు సుకుమారామంటే!
నీ సుతిమెత్తని శరీరాన్ని స్ప్రుసిస్తే పూలు సైతం నీపై మనస్సు పడతాయి!


అయస్కాంతమునకు ఏమితెలుసు ఆకర్షణ అంటే!
నిన్ను చూస్తే శిలలు కూడా నీ వెంటవస్తాయి! 

కవులకు ఏమితెలుసు కవిత్వమంటే!
నీతో సంభాషిస్తే తమను సైతం తాము మరిచిపోగలరు!

No comments:

Post a Comment