విశేషమైన జ్ఞానమే పరబ్రహ్మ స్వరూపము

Thursday, March 31, 2011

ఎవరు నేను?.


సకామ నిష్కామ కర్మలను ఎరిగిన నేను
కర్మ బద్ధుడన లేక కర్మ పరిత్యాగినా ఎవరు నేను?.


జ్ఞానా జ్ఞానములను  ఎరిగిన నేను
జ్ఞానినా లేక అజ్ఞానినా ఎవరు నేను?.


యమ నియమాలను ఎరిగిన నేను
సుబుద్ధినా లేక దుర్బుద్ధినా ఎవరు నేను?.


క్షేత్ర క్షేత్రజ్ఞములను ఎరిగిన నేను
దేహము కలిగినవాడిన లేక విదేహుడనా ఎవరు నేను?.


ఆత్మ నాత్మలను ఎరిగిన నేను
ఆత్మన లేక శూన్యమునా ఎవరు నేను?.


దృశ్యా దృశ్యములు ఎరిగిన నేను
దృశ్య రూపమునా లేక అదృశ్య శక్తినా ఎవరు నేను?.


నిత్యా నిత్యములను ఎరిగిన నేను
వివేకినా లేక అవివేకినా ఎవరు నేను?.


ఏకత్వము అద్వైతములను ఎరిగిన నేను
జీవమునా లేక జీవన్ముక్తుడనా ఎవరు నేను?.

No comments:

Post a Comment