విశేషమైన జ్ఞానమే పరబ్రహ్మ స్వరూపము

Thursday, March 31, 2011

భ్రాంతి


సువర్ణ రూప లావణ్యము కలిగిన నిన్ను చూసిన నేను 
ఏ రూపమును చూసిన అది నీ దివ్య స్వరూపమని భ్రాంతి నొందుచున్నాను!


సప్త స్వరాలంకారమయిన నీ స్వరమును విన్న నేను 
ఏ అపస్వరము విన్నను అది గాంధర్వ గానమని భావించుచున్నాను!


విప్పారిన కలువలువంటి నీ నేత్రములను గాంచిన నేను 
ఏ కంటి రెప రెపను చూసినా అది నీ క్రీగంటి చూపుగా తలచుచున్నాను!


సుకుమార కోమలమైన నీ దేహమును స్ప్రుసించిన నేను 
కటిన శిలలను సైతం పూలపాన్పులవలె బాసించుచున్నాను!


నీ మనోరధమునే పరమపద సోపానముగా నెంచి
అస్థిత్వముతో నే పరుగులేడుచున్నాను!

No comments:

Post a Comment