విశేషమైన జ్ఞానమే పరబ్రహ్మ స్వరూపము

Thursday, March 31, 2011

ఉన్నానని నేనున్నానని

నీరూపులో అపురూపమై ఉన్నానని నేనున్నానని 
తలచితిని నేతలచితిని మరచితిని నను మరచితిని! 

నీకురులలో ముంగురులై ఉన్నానని నేనున్నానని
తలచితిని నేతలచితిని మరచితిని నను మరచితిని!

నీ చూపులో నే మెరుపునై ఉన్నానని నేనున్నానని
తలచితిని నేతలచితిని మరచితిని నను మరచితిని!

నీ స్వరములో సుస్వరమునై ఉన్నానని నేనున్నానని
తలచితిని నేతలచితిని మరచితిని నను మరచితిని!

నీ శ్వాసలో సుగంధమై ఉన్నానని నేనున్నానని
తలచితిని నేతలచితిని మరచితిని నను మరచితిని!

నీ నవ్వులో చిరునవ్వునై ఉన్నానని నేనున్నానని
తలచితిని నేతలచితిని మరచితిని నను మరచితిని!

నీ భాషలో నే భావమై ఉన్నానని నేనున్నానని
తలచితిని నేతలచితిని మరచితిని నను మరచితిని!

నీ గాజుల గలగలలో అభేదమై ఉన్నానని నేనున్నానని
తలచితిని నేతలచితిని మరచితిని నను మరచితిని!

నీ అందెల మువ్వలలో సవ్వడినై ఉన్నానని నేనున్నానని
తలచితిని నేతలచితిని మరచితిని నను మరచితిని!

ఏ స్వప్నమో సుస్వప్నమై నీ దరిచేర్చేనని
తరించేను నే తపించెను, మరిపించేను నను మురిపించేను!

No comments:

Post a Comment