విశేషమైన జ్ఞానమే పరబ్రహ్మ స్వరూపము

Saturday, April 02, 2011

నీవే నేను

నాదని నాదని తనదనిఏదేని తనదేనని!
తననే దలచి తన తలపులలో నిలిచి!
అలసి సొలసి కలసి కలగలసిన మనస్సులో!
తన నెలవుకు నెలవని నెలవుకు నెలవులేదని దలచెను!

వలచితి వలచితినని వలపులలో!
తలపులు మరచి తరచి తరచి!
నను, వెదకి వెదకి వేదకితినేని!
మదిని పోరి రారమ్మని పిలిచితిని!


కసరి కసరి నను కసరినను!
నిను విడువక విడువనని!
నే పలుకని పలుకులు పలికిన!
తలపులను పిలిచి పిలిచి విడిచెన్!

No comments:

Post a Comment