విశేషమైన జ్ఞానమే పరబ్రహ్మ స్వరూపము

Friday, April 01, 2011

స్వచ్చమైన ప్రేమ


కనులు కనులతో కలవటం కాదు ప్రేమంటే!
మనసులు కలవడం ప్రేమంటే!


హృదయం దోచుకోవడం కాదు ప్రేమంటే!
హృదయాన్ని ఇవ్వటం ప్రేమంటే!


తనువులు కలవడం కాదు ప్రేమంటే!
తనకోసమే జీవించడం ప్రేమంటే!


 ప్రేమంటే తీసుకోవడం కాదు!
 ప్రేమంటే ఇవ్వటం!


ప్రేమంటే ఆకాంక్షించడం కాదు!
ప్రేమంటే ఆరాదించటం!.


ప్రపంచంలో స్వచ్చమైన ప్రేమ రెండు సంభందములు మధ్య గాడముగ ఉన్నది
అందులో ఒకటి తల్లీ బిడ్డల మధ్య ఉన్న ప్రేమ - ( పిల్లలు ఎంత భాదించినా తల్లి ప్రేమిస్తుంది ఎందుకటే ఆమె ప్రేమ పవిత్రమైనది మరియు అనంతమైనది )
రెండవది భగవంతునికి భక్తునికి మధ్య ఉన్న ప్రేమ :-
( భగవంతుని దృష్టిలో జీవులన్నీ బిడ్డలవంటివి. భగవంతుడు అందరికి సమానంగా తన ప్రేమను పంచుతాడు స్వీకరించే జనులలో తేడా ఉంటుంది కానీ భగవంతుని ప్రేమలో ఎటువంటి వ్యత్యాసము ఉండదు ఉండబోదు).
పై రెండు ప్రేమలలో ఎన్నటికి భేదం కనిపించదు.
 ఈప్రేమ నిర్మలమైనది, ఈ ప్రేమ నిశ్చలమైనది, ఈ ప్రేమ ఆనంద దాయకమైనది, ఈ ప్రేమ శ్వచ్చమైనది, ఈ ప్రేమ నిరావధికమైనది. ఈప్రేమ శాశ్వతమైనది.

No comments:

Post a Comment