విశేషమైన జ్ఞానమే పరబ్రహ్మ స్వరూపము

Saturday, April 30, 2011

నా ప్రశ్నలు - ప్రకృతి జవాబులు

ఆకాసంలో నక్షత్రాలు ఎన్ని?.
సముద్ర కెరటములన్ని.
సముద్ర కెరటములెన్ని?.
ఇసుకరేణువులన్ని.
ఇసుకరేణువులెన్ని?.
వికసించిన కుసుమాలన్ని.
వికసించిన కుసుమాలెన్ని?.
సూర్య కిరణాలన్ని.
సూర్య కిరణాలెన్ని?.
మానవుని మదిలో తలపులన్ని.
మానవుని మదిలో తలపులెన్ని?.
తల వెంట్రుకలన్ని.
తల వెంట్రుకలెన్ని ?.
ఆకాసంలో నక్షత్రాలన్నీ.

No comments:

Post a Comment