విశేషమైన జ్ఞానమే పరబ్రహ్మ స్వరూపము

Friday, April 01, 2011

శాశ్వత ఆనందం


ఉదయించే సూర్యోదయం కొద్ది గంటలు మాత్రమే ఉంటుంది
ఎంతో ఆహ్లాదం కలిగించే వెన్నెల రాత్రులు మాత్రమే ఉంటుంది 
ఆకాశంలో కనిపించే ఇంద్రధనస్సు కొద్దికాలమే ఉంటుంది 
ఎంతటి సౌందర్య వంతులనైన వృద్ధాప్యం కాటేస్తుంది 
ఎంతో అందముగా ఉండే గులాభీల తాజాదనం కొంత సమయమే ఉంటుంది 
సుందరమైన కట్టడాలు కొంతకాలానికి శిధిలం ఆవుతాయి 
ఎంతటి భలవంతుడిని అయిన ఓటమి భయం వెంటాడుతుంది 
గొప్ప పరాక్రమ వంతుడయిన రాజు కూడా కొంత కాలానికి తన వైభవాన్ని కోల్పోతాడు 
అందమయిన సరస్సులు ఆకర్షణ కొద్ది కాలము మాత్రమే ఉంటుంది 
ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యం, మనిషి మరణించే వరకు మాత్రమే తనతో ఉంటాయి 
కీర్తి, ప్రతిష్టలు శాశ్వత మయినవి, జీవితం అల్పమయినది అశాశ్వత మయినది 
పరోపకారము, భూతదయ, మంచి ప్రవర్తన మనిషి మరణించిన తరువాత కూడా జీవిస్తాయి.

No comments:

Post a Comment